బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ బౌలర్ అల్జరీ జోసెఫ్(Alzarri Joseph)కు రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడవ వన్డేలో.. బౌలింగ్ వేస్తున్న సమయంలో.. విండీస్ కెప్టెన్ సాయ్ హోప్‌తో జోసెఫ్ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అతను మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఫీల్డర్లను అమర్చే అంశంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. దీనిపై వెస్టిండీస్ క్రికెట్ సమీక్ష నిర్వహించింది. సీడబ్ల్యూఐ డైరెక్టర్ మైల్స్ బాస్కోంబ్ ఓ నిర్ణయం తీసుకున్నారు.
27 ఏళ్ల జోసెఫ్ ప్రవర్తన.. బోర్డు విలువలకు తగినట్లుగా లేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రవర్తనను పట్టించుకోకుండా ఉండలేమన్నారు. ఆ ప్రవర్తనకు తగినట్లు నిర్ణయం తీసుకున్నామని బాస్కోంబ్ తన ప్రకటనలో వెల్లడించారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని జోసెఫ్ స్వాగతించాడు. బహిరంగంగా క్షమాపణ జారీ చేశాడు.
వ్యక్తిగతంగా కెప్టెన్ హోప్‌కు క్షమాపణ చెప్పానని, టీం సభ్యులకు, మేనేజ్మెంట్కు కూడా సారీ చెప్పినట్లు వెల్లడించారు. తన వల్ల కలిగిన నిరాశకు క్షమాపణలు చెబుతున్నట్లు జోసెఫ్ తెలిపారు. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ కైవసం చేసుకున్నది.