Alyssa Healy : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వైజాగ్‌లో టీమిండియాకు చెక్ పెట్టిన ఆసీస్ గురువారం బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి సెమీస్ బెర్తు దక్కించుకుంది. కంగారూ టీమ్ విజయంలో శతకంతో చెలరేగిన కెప్టెన్ అలీసా హీలీ (Alyssa Healy) అజేయంగా నిలిచింది. వరల్డ్ కప్‌లో వరుసగా రెండో సెంచరీ బాదిన హీలీ.. ఈ టోర్నీ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం నమోదు చేసింది. బంగ్లా బౌలర్లను ఉతికేస్తూ.. 75 బంతుల్లోనే వంద పూర్తి చేసుకుందీ డాషింగ్ బ్యాటర్. తద్వారా ఇంగ్లండ్ స్టార్ నాట్ సీవర్ బ్రంట్ రికార్డును బద్ధలు కొట్టింది హీలీ. బ్రంట్ 2017లో 76 బంతుల్లో సెంచరీ కొట్టింది.
ప్రపంచ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు వెస్టిండీస్ డియాండ్ర డాటిన్ (Deandra Dottin) పేరిట ఉంది. ఈ చిచ్చరపిడుగు పాకిస్థాన్‌పై 71 బంతుల్లోనే శతక గర్జన చేసింది. ఆస్ట్రేలియాకే చెందిన అషే గార్డ్నర్ ఇదే వరల్డ్ కప్‌లో వేగవంతమైన వంద కొట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లను దంచేసిన తను.. 77 బంతుల్లోనే మూడంకెల స్కోర్ అందుకుంది. గార్డ్నర్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Back-to-back centuries at the Women’s World Cup:
Debbie Hockley vs SL and WI, 1997
Alyssa Healy vs WI and ENG, 2022
𝗔𝗹𝘆𝘀𝘀𝗮 𝗛𝗲𝗮𝗹𝘆 𝘃𝘀 𝗜𝗡𝗗 𝗮𝗻𝗱 𝗕𝗔𝗡, 𝟮𝟬𝟮𝟱 pic.twitter.com/82xXEdvY5t— ESPNcricinfo (@ESPNcricinfo) October 16, 2025
వరల్డ్ కప్‌లో హీలీ వరుసగా వరుసగా రెండో సెంచరీ బాదడం ఇది రెండోసారి. 2022లో ఈ ఫీట్ సాధించింది ఆసీస్ కెప్టెన్. ఆమెకంటే ముందు డెబ్బీ హక్లే (న్యూజిలాండ్) 1997లో ప్రపంచకప్‌లో రెండు శతకాలతో రికార్డు నెలకొల్పింది. మొత్తంగా చూస్తే.. ప్రపంచకప్‌లో హీలీకి ఇది నాలుగో సెంచరీ. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ ఐదు సెంచరీలతో టాప్‌లో ఉంది.