ODI World Cup : భారత గడ్డపై మరో మూడు రోజుల్లో మహిళల ప్రపంచ కప్ పోటీలకు తెరలేవనుంది. టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా ఏడుసార్లు ఛాంపియన్ అస్ట్రేలియా అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఈమధ్యే మూడు వన్డేల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకు చెక్ పెట్టిన ఆసీస్ వరల్డ్ కప్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. టోర్నీకి ముందే భారత అభిమానుల మనసులు చూరగొనేందుకు కంగారూ కెప్టెన్ అలీసా హేలీ (Alyssa Healy) సరదాగా ఓ విజ్ఞప్తి చేసింది. తమ జట్టు మ్యాచ్‌లకు అందరూ పసుపు రంగు జెర్సీలతో రావాలని ఆమె ఫ్యాన్స్‌ను కోరింది.
‘భారత అభిమానులారా వరల్డ్ కప్‌లో మీరంతా మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ ధరించండి. ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన పసుపు రంగు జెర్సీలతో మా మ్యాచ్‌లు చూసేందుకు రండి. మీరు అలా చేస్తే మేము చాలా సంతోషిస్తాం. ప్రేక్షకుల్లో ఎక్కువ మంది ఎల్సో జెర్సీతో కనిపిస్తే మా జట్టులో ఉత్సాహం నిండుతుంది. ఎంతైనా సీఎస్కే జెర్సీ.. మా టీమ్ జెర్సీ రంగు పసుపు వర్ణమే కదా’ అని హేలీ సరదాగా వ్యాఖ్యానించింది.
Alyssa Healy hopes for some ‘Yellove’ for the Aussies at Chepauk 💛#CWC25 #Australia #CSK pic.twitter.com/wGh79oceTB
— Circle of Cricket (@circleofcricket) September 27, 2025
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల ప్రపంచకప్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. దివంగత అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్‌కు నివాళులు.. ఆపై శ్రేయా ఘోషల్ పాటల హోరు తర్వాత ఆరంభ పోరులో టీమిండియా, లంక ఢీకొడుతాయి. ఈ మెగా టోర్నీలో అక్టోబర్ 1వ తేదీన న్యూజిలాండ్‌తో హేలీ సారథ్యంలోని ఆస్ట్రేలియా తలపడుంది. వరల్డ్ కప్ చరిత్రలో మరేజట్టుకు సాధ్యంకాని విధంగా ఏడు టైటిళ్లలు కొల్లగొట్టిన ఆసీస్ నుంచే మొదటిసారి ట్రోఫీ ముద్దాడాలనుకుంటున్న భారత్‌కు గట్టి పోటీ ఎదుర్వవనుంది.