శుక్రవారం 10 జూలై 2020
Sports - Apr 18, 2020 , 12:13:06

కేఎల్​ రాహుల్​కు హార్దిక్​ బర్త్​డే విషెస్​

కేఎల్​ రాహుల్​కు హార్దిక్​ బర్త్​డే విషెస్​

భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్​ 28వ పడిలోకి అడుగుపెట్టాడు. శనివారం అతడి పుట్టినరోజు సందర్భంగా టీమ్​ఇండియా క్రికెటర్లతో పాటు ఐసీసీ శుభాకాంక్షలు తెలిపింది. నిత్యం మద్దతిచ్చావంటూ రాహుల్​కు స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ఇన్​స్టాగ్రామ్ వేదికగా పాత ఫొటోను జతచేసి రాహుల్​ను విష్ చేశాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు.. బ్రదర్​మ్యాన్​.. నిత్యం నీ మద్దతు పొందా” అని హార్దిక్ రాసుకొచ్చాడు.

గతేడాది జనవరిలో కాఫీ విత్ కరణ్​ కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్​, రాహుల్​ అభ్యంతరకమైన వ్యాఖలు చేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నుంచి కేఎల్ రాహుల్ మరింత అద్భుతంగా ఆడుతూ ప్రస్తుతం టీమ్​ఇండియాలో కీలక ప్లేయర్​గా మారాడు. మూడు ఫార్మాట్లలో శతకం చేసిన మూడో భారత బ్యాట్స్​మన్​గా రికార్డు సైతం సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్​లో 221పరుగులు, మూడు వన్డేల సిరీస్​లో 204 పరుగులతో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే కేఎల్ రాహుల్​కు టీమ్​ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్​తో పాటు మరికొందరు శుభాకాంక్షలు తెలిపారు.  


logo