Pullela Gayatri | హైదరాబాద్ ఆట ప్రతినిధి: క్రీడాకారులంతా విజయం స్పూర్తితో ముందుకు సాగాలని భారత టెన్నిస్ ద్వయం పుల్లెల గాయత్రి, ట్రీసా జాలి అన్నారు. నగరంలోని గోపీచంద్ అకాడమీ వేదికగా జరిగిన యూనిక్స్ సన్రైస్ పదవ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అండర్-13 చాంపియన్‌షిప్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న గాయత్రి, జాలి విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ టోర్నీ బాలికల సింగిల్స్ విజేతగా హంసిని, డబుల్స్‌లో హంసిని-ప్రయంవద విజేతలుగా నిలవగా బాలుర విభాగంలో క్రిశవ్, డబుల్స్‌లో చిన్మయ్-క్రిశవ్ టైటిల్ నెగ్గారు. ఈ కార్యక్రమంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరి నాథ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వంశీధర్, తదితరులు హాజరయ్యారు.