హనుమకొండ చౌరస్తా, జనవరి 15: హనుమకొండలోని జవహర్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్) ఇండోర్ స్టేడియంలో జరిగిన 34వ సీనియర్ నేషనల్ సెపక్తక్రా చాంపియన్షిప్ పోటీలలో ఆలిండియా పోలీస్ క్రీడాకారుల జట్టు మూడు పతకాలు కొల్లగొట్టింది.
ఐదు రోజుల పాటు జరిగిన ఈ క్రీడలు మంగళవారం ముగియగా.. నాలుగు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలలో ఆలిండియా పోలీస్, ఎస్ఎస్బీ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. డబుల్ ఈవెంట్లో తెలంగాణ మహిళా క్రీడాకారులు వెండి పతకం సాధించగా పురుషుల జట్టు కాంస్యం దక్కించుకుంది.