హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు కోసం భారత మాజీ ఫుట్‌బాలర్ షబ్బీర్ అలీ పేరును అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్)సిఫారసు చేసింది. తన అద్భుత ఆటతీరుతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన హైదరాబాదీ షబ్బీర్ అలీ సేవలను ఏఐఎఫ్ఎఫ్ పరిగణనలోకి తీసుకుంది. అలీతో పాటు మాజీ ప్లేయర్లు విజయన్, అరుణ్ ఘోష్ పేర్లను పద్మశ్రీ అవార్డుకు ప్రతిపాదించారు.