హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా హ్యాండ్బాల్ క్లబ్ లీగ్ చాంపియన్షిప్లో అల్ కువైట్, అల్ నజ్మా ఫైనల్లోకి దూసుకెళ్లాయి. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన వేర్వేరు సెమీఫైనల్ మ్యాచ్ల్లో అల్ కువైట్ 25-20తో అల్ ఖద్సియాపై అద్భుత విజయం సాధించింది.
మరో పోరులో అల్ నజ్మా 22-21తో అల్ అరబీపై ఉత్కంఠ గెలుపు సొంతం చేసుకుంది. గురువారం చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.