హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ట్ర ప్లేయర్ల జోరు కొనసాగుతున్నది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన సర్గారీ అఖిల్‌రెడ్డి వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల 109+ కిలోల విభాగంలో బరిలోకి దిగిన అఖిల్..స్నాచ్‌లో 136కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 166కిలోలు..మొత్తంగా 302 కిలోలతో మూడో స్థానంలో నిలిచాడు. రుద్రమయాన్(326కి), కుశాల్గౌడ(304కి) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లా నెదునూరు గ్రామానికి చెందిన అఖిల్ ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలో బీఏ చదువుతున్నాడు.
టెన్నిస్ సెమీస్‌లో ఓయూ: ఖేలోఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా పురుషుల టెన్నిస్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రౌండ్-1లో ఓయూ..పంజాబ్ యూనివర్సిటీపై అద్భుత విజయం సాధించింది. సాయికార్తీక్ 6-3, 6-3తో యోగి పన్వర్‌పై గెలువగా, సుచిత్ 6-3, 6-4తో హర్జస్లీమ్ సింగ్‌పై, ఆకాశ్, శశాంక్ తివారీ జోడీ 6-7, 3-6తో నవ్‌నీత్ చాహల్, హర్జాసింగ్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. మిగిలిన రౌండ్లలో ఓయూ..జాదవ్‌పూర్ యూనివర్సిటీపై 3-0తో, భర్కతుల్లా విశ్వవిద్యాలయంపై 3-0 విజయాలతో సెమీస్‌లోకి ప్రవేశించింది.