బెల్గ్రేడ్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఆకాశ్ కుమార్ (54 కేజీలు), నరేందర్ బర్వాల్ (ప్లస్ 92 కేజీలు) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. బెల్గ్రేడ్ వేదికగా ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో ఆకాశ్ 5-0తో కలెబ్ టిరాడో (పొర్టోరికో)ను ఓడించగా.. నరేందర్ తన పవర్ఫుల్ పంచ్‌లతో జఖాన్ ఖర్బన్వో (తజకిస్థాన్)ను చిత్తు చేశాడు. అంతకుముందు శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌ల్లో సుమిత్ (75 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) నెగ్గి సత్తా చాటగా.. సచిన్ (80 కేజీలు) ఓటమి పాలయ్యాడు.