దుబాయ్: ఫార్ములా రీజనల్ మిడిల్ ఈస్ట్రన్ చాంపియన్షిప్ తొలి రౌండ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సత్తాచాటింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ రేసులో నలుగురు డ్రైవర్లతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ అద్వితీయ ప్రతిభ కనబరిచింది. స్పానిష్ డ్రైవర్ మారీ బోయా, ఫ్రెంచ్ డ్రైవర్ అమీ మిగ్యూటౌనిప్, అమెరిడా రేర్ బ్రాడ్ బెనావిడెస్, డానిష్ డ్రైవర్ సెబాస్టియన్ ఓగార్డ్లు.. బ్లాక్బర్డ్స్ను పరుగులు పెట్టించారు. దుబాయ్ వేదికగా పాల్గొన్న తొలి రేసులోనే సత్తాచాటడం ఆనందంగా ఉందని హైదరాబాద్ టీమ్ ప్రతినిధి కార్తీక్ సెల్వరాజ్ తెలిపాడు. ‘ఇండియన్ రేసింగ్ లీగ్లో రాణించిన డ్రైవర్లకు అంతర్జాతీయ స్థాయిలో ఇదో మంచి అవకాశం. బరిలోకి దిగిన తొలి రేసులోనే చక్కటి ప్రదర్శన కనబర్చడం ఆనందంగా ఉంది. టీమ్ విజయంలో భాగస్వాములైన డ్రైవర్లకు అభినందనలు’ అని కార్తీక్ పేర్కొన్నాడు.