FIFA World Cup Trophy : ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్‌న్యూస్. నిరుడు ‘గోట్ ఇండియా టూర్ ఆఫ్ ఇండియా 2025’లో లియోనల్ మెస్సీ (Lionel Messi) భారత్‌లోని ప్రధాన నగరాలను మెరుపులా చుట్టేయగా.. ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ (FIFA World Cup Trophy) సందడి మొదలైంది. మెగా టోర్నీకి 6 నెలల గడువే ఉండడంతో నిర్వాహకులు ట్రోఫీని అభిమానుల సందర్శన కోసం భారత్‌కు తీసుకొచ్చారు. ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) అధ్యక్షుడు కల్యాణ్ చౌబే(Kalyan Chaube) ట్రోఫీని ఆవిష్కరించాడు.
పుష్కరకాలం తర్వాత ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని భారత్‌లో ప్రదర్శిస్తున్నారు. మూడు రోజులు దేశంలోని ప్రధాన నగారాల్లో అభిమానుల సందర్శనార్థం ఈ ట్రోఫీని ఉంచుతారు. ఫిఫా ట్రోఫీ ఆవిష్కరణలో ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే, కేంద్ర క్రీడల మంత్రి, యువజనుల వ్యవహారాల మంత్రి మన్సూఖ్ మాండవీయ (Mansukh Mandaviya), బ్రెజిల్ వరల్డ్‌కప్ విజేత గిల్బెర్టో సిల్వా పాల్గొన్నారు. రెండు రోజులు ఢిల్లీలోని ప్రముఖ సెంటర్లలో ఫిఫా ట్రోఫీని ప్రదర్శనకు ఉంచుతారు. అనంతరం అస్సాంలోని గువాహటిలో వరల్డ్‌కప్ ట్రోఫీ సందడి చేయనుంది.
#WATCH | Delhi | Union Minister for Sports Mansukh Mandaviya and former Brazilian footballer Gilberto D’silva unveil the FIFA World Cup 2026 Trophy, which is on its three-day India tour.
The trophy will be in Delhi for two days, then taken to Guwahati for one day. pic.twitter.com/uRlr8yvre6
— ANI (@ANI) January 10, 2026
అయితే.. భారత ఫుట్‌బాల్‌ను నాశనం చేస్తున్న చౌబే.. సాకర్ కప్‌ను ఆవిష్కరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఇండియన్ సూపర్ లీగ్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి మన్సూఖ్ పాపులర్ జట్ల మోహున్ బగన్, ఈస్ట్ బెంగాల్ పేర్లను తప్పుగా పలకడం కూడా విమర్శలకు తావిచ్చింది. మండిపడుతున్నారు.
ఈఏడాది ఫిఫా ప్రపంచకప్ పోటీలకు అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 11వ తేదీ గురువారం ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. నెల రోజులకుపైగా అభిమానులను గోల్స్ వర్షంలో ముంచెత్తనున్న ఈ టోర్నీ జూలై 19వ తేదీన ముగియనుంది. గత సీజన్లో విజేతగా నిలిచిన అర్జెంటీనా(Arjentina) డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.