SA Vs WI | ట్రినిడాడ్: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో కరీబియన్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్ షై హోప్ (22 బంతుల్లో 41, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ రొవ్మన్ పావెల్ (22 బంతుల్లో 35, 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు.
ఛేదనలో దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌట్ అయింది. రీజా హెండ్రిక్స్ (18 బంతుల్లో 44, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (28) రాణించినా మిడిలార్డర్ వైఫల్యంతో ఆ జట్టు తడబడింది. యువ పేసర్ షమర్ జోసెఫ్ (3/31), రొమారియో షెఫర్డ్ (3/15) ధాటికి సఫారీలు చేతులెత్తేశారు. తొలి టీ20లోనూ విండీస్ విజయం సాధించగా ఈ సిరీస్లో నామమాత్రమైన మూడో టీ20 బుధవారం జరుగనుంది.