ఏషియన్ టోర్నీకి నిత్య, నందిని
దక్షిణకొరియా వేదికగా జరుగనున్న ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) 59 మందితో జట్టును శుక్రవారం ఎంపిక చేసింది.
- 59 మందితో భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: దక్షిణకొరియా వేదికగా జరుగనున్న ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) 59 మందితో జట్టును శుక్రవారం ఎంపిక చేసింది. కొచ్చిలో తాజాగా ముగిసిన ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారిని ఏషియన్ చాంపియన్‌షిప్‌నకు పరిగణనలోకి తీసుకున్నారు.
తెలంగాణ నుంచి నిత్య గాదెతో పాటు అగసర నందిని భారత అథ్లెటిక్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. మహిళల 200మీటర్ల రేసుతో పాటు 4X 100 రిలే రేసులో నిత్య బరిలో దిగనుండగా, హెప్టాథ్లాన్‌లో నందిని పోటీపడనుంది. ఇదిలా ఉంటే స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా..ఏషియన్ అథ్లెటిక్స్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. చివరిసారి 2017లో ఆడిన నీరజ్..ప్రతిష్ఠాత్మక టోర్నీలై డైమండ్ లీగ్‌తో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లపై దృష్టి సారించాడు. దీనికి తోడు వచ్చే నెల బెంగళూరులో జరుగనున్న ‘నీరజ్ చోప్రా’ క్లాసిక్ టోర్నీ కోసం నీరజ్ సిద్ధమవుతున్నాడు.
షాట్‌పుటర్ తజిందర్పాల్సింగ్తో పాటు పోల్‌వాల్టర్ దేవ్కుమార్మీనా భారత జట్టులో చోటు దక్కించుకోపోగా, అవినాశ్ సాబ్లె, పారుల్ చౌదరీ, గుల్వీర్సింగ్, జ్యోతి యర్రాజీ, ప్రవీణ్ చిత్రవేల్ సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి.. 75 కేసులు నమోదు
AP Group-2 | 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్.. డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి
Sonia Gandhi | సీరియల్ కిల్లర్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లా : సోనియాగాంధీ
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

