గెబెహ: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (633 వికెట్లు)గా రషీద్ నిలిచాడు. తద్వారా గతంలో వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో పేరిట ఉన్న 631 వికెట్ల రికార్డు కనుమరుగైంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఏ20లో ఎంఐ కేప్‌టౌన్ తరఫున ఆడుతున్న రషీద్.. పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2వికెట్లు పడగొట్టి ఈ ఘనతను సాధించాడు.
పాకిస్థాన్‌కు వెళ్లను
దుబాయ్: పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత అంపైర్ నితిన్ మీనన్ తప్పుకున్నాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఉన్న మీనన్.. భారత్ నుంచి టోర్నీలో ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్న ఒకే ఒక్కడు. కానీ అతడు మాత్రం పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించాడు. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఐసీసీ అతడిని చాంపియన్స్ ట్రోఫీ రోస్టర్‌లో ఉంచాలనుకుంది. కానీ ఆయన వ్యక్తిగత కారణాలతో పాక్‌కు వెళ్లడం లేదు’ అని తెలిపాడు.