పాకిస్థాన్‌ది అదే జోరు. ఏమాత్రం తగ్గడం లేదు. గత రెండు మ్యాచ్‌లలో ఎలా ఫామ్‌లో ఉందో ఇప్పుడు కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఆఫ్ఘాన్ ప్లేయర్లను తన బౌలింగ్‌తో కట్టడి చేస్తోంది పాక్. దీంతో ఆప్ఘనిస్థాన్ ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. కేవలం 49 పరుగులకే సరిపెట్టుకుంది.
ఆప్ఘాన్ ఓపెన్లరలో జజాయ్ డక్ ఔట్ అవడంతో ఆప్ఘాన్ కొంచెం తడబడింది. మరో ఓపెనర్ మహమ్మద్ షాహ్జాద్ 9 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
రహ్మనుల్లా గర్బాజ్ 7 బంతుల్లో 10 పరుగులు, అస్గర్ ఆప్ఘాన్ 7 బంతుల్లో 10 పరుగులు, జనత్ 7 బంతుల్లో 11 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో జనత్, నజీబుల్లా ఉన్నారు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. ఇమాద్ వాసిమ్ 2 ఓవర్లు వేసి ఒక వికెట్, హరిశ్ రవుఫ్ 1 ఓవర్ వేసి 1 వికెట్, హసన్ అలీ 1 ఓవర్ వేసి ఒక వికెట్ తీశారు.
2⃣ down!
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
Shaheen gets into the act as he gets the scalp of Shahzad.
Babar Azam takes the catch.#T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/aRUUaG7X5m