NZ vs AFG | బంతి తాకినా నాటౌట్.. కివీస్‌ను ముంచిన అఫ్గన్ ఓపెనర్
NZ vs AFG : టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గనిస్థాన్ (Afghanistan) సంచలన విజయం నమోదు చేసింది. అఫ్గన్ జట్టు భారీ స్కోర్‌కు కారణమైన రహ్మనుల్లా 12 పరుగుల వద్ద లైఫ్ లభించింది. అదే జరిగి ఉంటే.. అతడు తొలి వికెట్‌కు ఇబ్రహీం జర్దాన్(44)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పేవాడేకాదు.
NZ vs AFG : టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గనిస్థాన్(Afghanistan) సంచలన విజయం నమోదు చేసింది. అన్ని విభాగాల్లో తమకైన బలమైన న్యూజిలాండ్ (Newzealand)ను చిత్తు చిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(80) అర్ధ సెంచరీతో చెలరేగగా.. ఆ తర్వాత బౌలర్లు కివీస్ బ్యాటర్ల భరతం పట్టారు. దాంతో, కాబూలీ జట్టు 84 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది.
అయితే.. అఫ్గన్ జట్టు భారీ స్కోర్‌కు కారణమైన రహ్మనుల్లా 12 పరుగుల వద్ద లైఫ్ లభించింది. కివీ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ వేసిన బంతిని ఫ్రంట్‌ఫుట్ వచ్చి ఆడబోయాడు. కానీ, బాల్ అనూహ్యంగా టర్న్ తీసుకొని లెగ్‌స్టంప్‌ను తాకుతూ బౌండరీ వైపు వెళ్లింది. ఒకవేళ బెయిల్స్ కదలడంగానీ, కిందగానీ పడి ఉంటే గుర్బాజ్ అప్పుడే ఔటయ్యేవాడు. అదే జరిగి ఉంటే.. అతడు తొలి వికెట్‌కు ఇబ్రహీం జర్దాన్(44)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పేవాడేకాదు.
ఫజల్, రషీద్ విజృంభణ..
తొలుత ఆడిన అఫ్గనిస్థాన్‌కు ఓపెనర్లు గుర్జాబ్, ఇబ్రహీంలు శుభారంభమిచ్చారు. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికారేస్తూ తొలి వికెట్‌కు 103 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా సైతం దంచడంతో రషీద్ ఖాన్ బృందం కివీస్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిని కివీస్ ఆది నుంచి తడబడింది. పేసర్ ఫజల్ హక్ ఫారూఖీ(4/17), కెప్టెన్ రషీద్(4/17)లు సంచలన స్పెల్‌తో విలియమ్సన్ సేన 75 పరుగులకే ఆలౌటయ్యింది.
ఇవి కూడా చదవండి
- FIH Pro League | జర్మనీ జోరుకు అమ్మాయిలు డీలా.. భారత్‌కు ఏడో ఓటమి
- Gold – Silver Rates | శనివారం ఒక్కరోజే రూ.2000 తగ్గిన బంగారం.. అదే బాటలో వెండి..
- Telangana | భార్యతో గొడవ.. కిరోసిన్ పోసి ఇంటిని కాల్చేసిన భర్త
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

