Nephew-Uncle Duo in Cricket | ప్రపంచ క్రికెట్లో అరుదైన సన్నివేశం.. కలిసి క్రికెట్ ఆడిన బాబాయ్ – అబ్బాయ్
Nephew-Uncle Duo in Cricket | ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో కవళలు, అన్నాతమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. కానీ బాబాయ్ - అబ్బాయ్ కలిసి క్రికెట్ ఆడటం ఎప్పుడైనా చూశారా..? అంతర్జాతీయ క్రికెట్లో ఈ అరుదైన సన్నివేశం బుధవారం చోటుచేసుకుంది.
Nephew-Uncle Duo in Cricket | క్రికెట్లో అన్నాతమ్ముళ్లు, అక్కా చెళ్లెల్లు ఆడట సర్వ సాధారణమే. ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో కవళలు, అన్నాతమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. కానీ బాబాయ్ – అబ్బాయ్ కలిసి క్రికెట్ ఆడటం ఎప్పుడైనా చూశారా..? అంతర్జాతీయ క్రికెట్లో ఈ అరుదైన సన్నివేశం బుధవారం చోటుచేసుకుంది. ఐర్లాండ్-అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. అఫ్గాన్ తరఫున స్టార్ బ్యాటర్‌గా ఉన్న ఇబ్రహీం జద్రాన్.. తన బాబాయ్ అయిన నూర్ అలి జద్రాన్‌తో కలిసి అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడం విశేషం. ఇబ్రహీం వయసు 22 ఏండ్లు కాగా నూర్ అలీకి 35 ఏండ్లు.
ఐర్లాండ్‌తో అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఇందుకు వేదికైంది. నూర్ అలీ జద్రాన్.. 2009లోనే అఫ్గాన్ తరఫున వన్డేలు ఆడినా ఆ తర్వాత అతడు పలు కారణాలతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. కానీ ఇటీవలే దేశవాళీలలో రాణించి మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవలే శ్రీలంకతో జరిగిన ఏకైక టెస్టులో నూర్ అలీ.. తన అల్లుడైన ఇబ్రహీం జద్రాన్ చేతి నుంచే అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. తాజాగా ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఈ ఇద్దరూ కలిసి అఫ్గాన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం గమనార్హం. ఈ ఇద్దరూ కలిసి ఆడుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ibrahim Zadran opening with his uncle Noor Ali Zadran in a Test match.
– Ibrahim handed the Test cap to his uncle Noor a few weeks back. pic.twitter.com/aR6ikWM1QM
— CRICKET (@Islamic95024167) February 28, 2024
లేటు వయసులో జాతీయ జట్టులోకి వచ్చినా అల్లుడితో కలిసి మ్యాచ్ ఆడుతున్న నూర్ అలీ.. తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేదు. 27 బంతులు ఎదుర్కున్న అతడు.. ఏడు పరుగులే చేసి ఔటయ్యాడు. ఇబ్రహీం జద్రాన్ మాత్రం హాఫ్ సెంచరీ (53)తో రాణించాడు.
Only in Afghanistan would a 35 year old player be preferred over a fit youngster with impeccable first-class record!!
Noor Ali Zadran may be one of the classiest players Afg have had, but to play him instead of the young crop is not justifiable.. even if he scores big.…
— Mirza Nomaan (@Nkashrafi) February 28, 2024
ఇక టెస్టు విషయానికొస్తే.. అబుదాబిలోని టాలరెన్స్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 36 ఓవర్ల ఆట ముగిసేసరికి ఏడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

