ISSF Junior World Cup : ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో భారత షూటర్ల (Indian Shooters) పతకాల పంట పండిస్తున్నారు. శుక్రవారం యువ షూటర్ అద్రియాన్ కర్మాకర్(Adriyan Karmakar) కాంస్యంతో గర్జించాడు. 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్స్లోకి కంచు మోత మోగించి రెండో మెడల్ ఖాతాలో వేసుకున్నాడు. తొలిసారి వరల్డ్ కప్లో పోటీ పడుతున్న ఈ కుర్ర షూటర్ గురువారం 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.
శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో అద్రియాన్ అదరగొట్టాడు. 41వ షాట్లో 10.8, 42వ షాట్లో 10.6 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. అద్రియాన్ కాంస్యంతో భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానం నిలబెట్టుకుంది. మహిళల త్రీపిస్టల్ విభాగంలో 17 ఏళ్ల అనౌష్క తోకుర్ (Anoushka Thokur) 7వ స్థానంతో సరిపెట్టుకుంది.