బెంగళూరు: 86వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో రౌనక్ చౌహాన్, ఆదర్శిని శ్రీ సెమీఫైనల్లోకి ప్రవేశించారు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో రౌనక్ 21-10, 21-16తో 14వ సీడ్ అలప్ మిశ్రాపై అలవోక విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఆదర్శిని 23-21, 21-12తో శ్రేయా లెలెపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది.