ACC U19 Asia Cup, 2023: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ అండర్ 19 ఆసియా కప్ -2023లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. అగ్రశ్రేణి జట్లు అయిన భారత్, పాకిస్తాన్లకు సెమీఫైనల్లో బంగ్లాదేశ్, యూఏఈలు ఊహించని షాకిచ్చాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు బంగ్లాదేశ్ షాకివ్వగా.. పాకిస్తాన్‌ను యూఏఈ ఓడించింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత అండర్ – 19 జట్టు.. 42.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున ఆడే సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్.. 62 బంతుల్లో 50 పరుగులు చేయగా.. హైదరాబాద్ ప్లేయర్ మురుగన్ అభిషేక్.. 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో మరుఫ్ మృధ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం బంగ్లాదేశ్.. 42.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో అరిఫుల్ ఇస్లాం (94), అహ్రర్ అమిన్ (44)లు రాణించి ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు.
ACC Men’s U19 Asia Cup 2023
Bangladesh U19 Vs India U19 | Semi-FinalBangladesh U19 won by 4 wickets 🇧🇩 🫶
Photo Credit: CREIMAS Photography#BCB | #Cricket | #U19 | #ACCMensU19AsiaCup pic.twitter.com/sl4zKr6sVV
— Bangladesh Cricket (@BCBtigers) December 15, 2023
ఇక పాక్ – యూఏఈ మధ్య జరిగి మరో సెమీస్‌లో యూఏఈని తొలుత 193 పరుగులకే కట్టడి చేసిన పాకిస్తాన్ ఛేదనలో మాత్రం చేతులెత్తేసింది. 194 పరుగుల ఛేదనలో పాక్ కుర్రాళ్లు.. 49.3 ఓవర్లలో 182 పరుగులే చేసి ఆలౌట్అవడంతో యూఏఈ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. యూఏఈ బౌలర్లు సమిష్టిగా రాణించి పాక్‌కు షాకిచ్చారు. సంచలన విజయాలతో ఫైనల్ చేరిన బంగ్లాదేశ్, యూఏఈలు డిసెంబర్ 17న తుదిపోరులో ఢీకొననున్నాయి.
Congratulations boys! You have made us SUPER proud 😍😍 https://t.co/5uqx0su56Y
— UAE Cricket Official (@EmiratesCricket) December 15, 2023