Kabaddi Winners | ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 9 విన్నర్‌గా జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు నిలిచింది. పుణెరీ పల్టన్స్‌పై 33-29 తో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఘన విజయాన్ని అందుకుని ట్రోపీని ముద్దాడింది. రెండో సారి ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్‌ను చేజిక్కించుకున్న సందర్భంగా జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కబడ్డీ అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలోనే తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను, ముద్దుల కూతురు ఆరాధ్యను గుండెలకు హత్తకుని హల్చల్ చేశారు. డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఈ ప్రత్యేక సందర్భానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన చిత్రాలను అభిషేక్, ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిషేక్ ఆనందానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.