Abhishek Sharma | ఆసియా కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. సూపర్-4లో పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాది మట్టికరిపించింది. దాయాది నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బాల్స్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుభ్‌మన్ గిల్ టీమ్ఇండియాకు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అభిషేక్ శర్మ ఫోర్లు, సిక్సులతో పాక్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో తక్కువ బాల్స్‌లో 50 సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కేవలం 331 బంతుల్లోనే 50 సిక్సులు బాదిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఆ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు ఈవిన్ లూయిస్ పేరుపై ఉన్నది. అతడు 366 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మూడో స్థానంలో అడ్రే రస్సెల్ ఉండగా, హజ్రతుల్లా జాజై (అఫ్గానిస్థాన్), టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 350 బంతుల్లో 50 సిక్సులు కొట్టిన వారి జాబితాలో నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 రన్స్ చేసిన అభిషేక్ మరో రికార్డును కూడా సొతం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో రెండుసార్లు తొలి బంతికే సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.
Classic Abhishek Sharma 💥
Watch #INDvPAK LIVE NOW, on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/hORYGOrpgS
— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025
For his aggressive half-century in the chase, Abhishek Sharma wins the Player of the Match 🔥#TeamIndia kickstart the #Super4 stage with a resounding win ✅
Scoreboard ▶️ https://t.co/CNzDX2HKll#AsiaCup2025 pic.twitter.com/GuKoAdAoGI
— BCCI (@BCCI) September 21, 2025