IPL 2025 : భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తున్న అభిషేక్ శర్మ(100) సెంచరీ బాదేశాడు. బౌండరీలతో చెలరేగిన ఈ లెఫ్ట్ హ్యాండర్ .. శశాంక్ సింగ్ బౌలింగ్లో రెండు ఫోర్లు బాది 98కు చేరువయ్యాడు. ఆ తర్వాత చాహల్ బౌలింగ్లో సింగిల్ తీసిన అభిషేక్ ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించాడు.
40 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో వంద పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇషాన్ కిషన్, ప్రియాన్ష్ ఆర్య తర్వాత ఈ సీజన్లో మూడో శతకం బాదిన క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. అంతకుమందు.. ఇదే ఓవర్లో సిక్సర్ బాదిన ట్రావిస్ హెడ్(66) మ్యాక్స్వెల్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో,171 వద్ద సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు స్కోర్.. 175-1.
📸📸
“𝙏𝙝𝙞𝙨 𝙤𝙣𝙚 𝙞𝙨 𝙛𝙤𝙧 𝙩𝙝𝙚 𝙊𝙧𝙖𝙣𝙜𝙚 𝘼𝙧𝙢𝙮” ✍️@SunRisers fans, drop your reply to Abhishek’s note in one word 🧡
Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/wTECpG7Uzi
— IndianPremierLeague (@IPL) April 12, 2025