IPL 2025 : సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(56 నాటౌట్) దంచేస్తున్నాడు. 49 పరుగుల వద్ద అతడు గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు. 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన అభి.. 28 బంతుల్లోనే ఫిఫ్టీకి చేరువయ్యాడు. మరో ఎండ్‌లో హెన్రిచ్ క్లాసెన్(12) సైతం వేగంగా ఆడుతున్నాడు. దాంతో, హైదరాబాద్ లక్ష్యం కరుగుతూ వస్తోంది. వీళ్లిద్దరూ చివరిదాకా నిలబడితే ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించడం ఖాయమే. 12 ఓవర్లకు స్కోర్.. 109-2.
అహ్మదాబాద్‌లో 225 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. సిరాజ్ వేసిన తొలి బంతినే అభిషేక్ శర్మ(56 నాటౌట్) స్టాండ్స్‌లోకి పంపాడు. ట్రావిస్ హెడ్(20) సైతం ఫోర్ కొట్టగా 15 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇషాంత్ బౌలింగ్‌లో అభిషేక్ సిక్సర్ బాదాడు. 4వ ఓవర్లో హెడ్ 4 కొట్టగా.. అభిషేక్ సిక్సర్‌తో స్కోర్ 40 దాటింది.
#SRH lose Travis Head inside the powerplay ☝️
Swipe to see the brilliance of Rashid Khan 🤩
Updates ▶ https://t.co/u5fH4jQrSI#TATAIPL | #GTvSRH | @rashidkhan_19 pic.twitter.com/1DKtiha4oy
— IndianPremierLeague (@IPL) May 2, 2025
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్రసిధ్ విడదీసి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే ఇషాన్ కిషన్(13) సైతం ఔటయ్యాడు. కొయెట్జీ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన ఇషాన్.. ప్రసిధ్ చేతికి దొరికిపోయాడు. దాంతో, 82 వద్ద హైదరాబాద్ రెండో వికెట్ పడింది.