IPL 2024 SRH vs GT : ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) జట్టు అనూహ్యంగా తడబడింది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దాడిని ఎదుర్కోలేక టాపార్డర్ చేతులెత్తేయగా.. అభిషేక్ శర్మ(28), చివర్లో కుర్రాళ్లు అబ్దుల్ సమద్(29నాటౌట్), షహ్బాజ్ అహ్మద్(22)లు పోరాడారు. దాంతో హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 161 స్కోర్ చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో వికెట్లు పడగొట్టారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఓపెనర్లు దంచారు. 34 పరుగులకే మయాంక్(16) ఔటైనా అభిషేక్ జతగా హెడ్(19) దంచాడు. దాంతో, పవర్ ప్లేలోనే కమిన్స్ సేన వికెట్ నష్టానికి 56 రన్స్ చేసింది.
I. C. Y. M. I
A big wicket ✅
A stunning catch ✅Rashid Khan is in the thick of things 👏 👏
Head to @JioCinema & @StarSportsIndia to watch the match LIVE 💻📱
Follow the match ▶️ https://t.co/hdUWPFsHP8 #TATAIPL | #GTvSRH | @gujarat_titans | @rashidkhan_19 pic.twitter.com/YAYQ2bk1hd
— IndianPremierLeague (@IPL) March 31, 2024
ఆ తర్వాత నూర్ అహ్మద్ సూపర్ డెలివరీతో హెడ్‌ను బౌల్డ్ చేశాడు. అక్కడితో వికెట్ల పతనం మొదలైంది. కమిన్స్ సేనకు షాక్ తగిలింది.విధ్వంసక ఆటగాళ్లు అభిషేక్ శర్మ(28), క్లాసెన్(24), మర్క్రమ్(17)లు భారీ స్కోర్ చేయలేకపోయారు. దాంతో, హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో రన్స్‌కే పరిమితమైంది.