IPL 2025 : సన్‌రైజర్స్ ఆటగాళ్లు రెచ్చిపోతే కొండంత లక్ష్యమైనా కరగాల్సిందే. గత సీజన్లో రికార్డు స్కోర్‌తో చరిత్ర సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ.. తమకు తామే సాటి అని చాటుతూ ఉప్పల్ స్టేడియంలో 245 పరగుల టార్గెట్‌ను ఊది పడేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(100) పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ వీరోచిత శతకం సాధించాడు. ఉప్పల్ స్టేడియం నలువైపులా బౌండరీలతో అలరించిన అభిషేక్… ట్రావిస్ హెడ్(66)తో తొలి వికెట్‌కు 171 రన్స్ జోడించి పంజాబ్ ఆశలపై నీళ్లు హెడ్ ఔటయ్యాక హెన్రిచ్ క్లాసెన్(21 నాటౌట్)తోడుగా హైదరాబాద్‌ను గెలుపు దిశగా నడిపించిన అభిషేక్.. విజయానికి 24 పరుగుల దూరంలో ఔటయ్యాడు. అయితే.. ఇషాన్ కిషన్(9 నాటౌట్) జతగా క్లాసెన్ లాంఛనం ముగించారు. దాంతో, కమిన్స్ సేన రికార్డు ఛేదనతో ఈ ఎడిషన్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 18వ సీజన్లో ఎట్టకేలకు సన్‌రైజర్స్ ఓపెనర్లు ఫామ్‌లోకి వచ్చారు. తాము ఆడితో ఎలా ఉంటదో చూపించారు. 17వ సీజన్లో పవర్ ప్లేలోనే 120 కొట్టిన ఓపెనర్లు అభిషేక్ శర్మ(141), ట్రావిస్ హెడ్(66)లు రికార్డు ఛేదనలో పోటాపోటీగా ఆడారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో ట్రావిస్ హెడ్(30) రెండు బౌండరీలు బాదాడు. యాన్సెస్ బౌలింగ్‌లో బ్యాట్ ఝులిపించిన అభిషేక్ శర్మ(56) 4 ఫోర్లు సంధించి 16 రన్స్ పిండుకున్నాడు. అనంతరం అర్ష్‌దీప్‌కి చుక్కలు చూపిస్తూ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు హెడ్. దాంతో 3 ఓవర్లకే సన్‌రైజర్స్ స్కోర్ 40కి చేరింది. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన యశ్ ఠాకూర్ ఓవర్లో అభిషేక్ సిక్సర్ బాదగా స్కోర్ 50 దాటింది. కానీ, ఆ తర్వాత బంతికే బౌండరీ వద్ద శశాంక్ సింగ్ క్యాచ్ అందుకున్నా అది నో బాల్ కావడంతో ఆరెంజ్ ఆర్మీ సంబురాలు చేసుకుంది.
𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯
A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪
Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w
— IndianPremierLeague (@IPL) April 12, 2025
నో బాల్‌తో లైఫ్ లభించడంతో అభిషేక్ సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. లెగ్ సైడ్, ఫైన్ లెగ్, లాంగాఫ్.. బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. హెడ్‌ను చాహల్ ఔట్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న పంజాబ్‌కు మళ్లీ గుండెదడ పెంచాడు అభిషేక్. 171 వద్ద వికెట్ పడినా వరుసపెట్టి బౌండరీలతో చెలరేగాడీ ఈ లెఫ్ట్ హ్యాండర్. హిట్టింగ్ డోస్ పెంచిన అతడు చాహల్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన అభిషేక్ ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించాడు.
ఫిఫ్టీకి 19బంతులు తీసుకున్న అతడు మరో 21 బంతుల్లోనే శతకం సాధించాడు. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో ఐపీఎల్లో తొలి వంద పూర్తి చేసుకున్నాడు అభిషేక్ 15వ ఓవర్లో 6, 4, 6 బాది జట్టు స్కోర్ 200కి చేరింది. ఆ తర్వాత యశ్ ఠాకూర్‌కు సిక్సర్‌తో స్వాగతం పలికిన ఈ చిచ్చరపిడుగు.. లెగ్ సైడ్ ఫోర్‌తో లక్ష్యాన్ని సులభం చేశాడు. జట్టు విజయానికి 24 పరుగులు అసవరం అనగా.. అభిషేక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(9 నాటౌట్), క్లాసెన్(21 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. యశ్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని బౌండరీకి తరలించిన క్లాసెన్ జట్టుకు 8 వికెట్ల విజయాన్ని అందించాడు.
ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పరుగుల వరద పారింది. ఫ్లాట్ పిచ్ మీద పంజాబ్ కింగ్స్ టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్(42), ప్రియాన్ష్ ఆర్య(36)లు శుభారంభం ఇవ్వగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(82) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించిన అయ్యర్ అర్ధ శతకంతో చెలరేగాడు. జట్టు స్కోర్ 200 దాటించి ఆరెంజ్ ఆర్మీని భయపెట్టాడు. అయితే.. హర్షల్ పటేల్(4-42) సంచనల బౌలింగ్‌తో కీలక వికెట్లు తీసి బ్రేకిచ్చాడు. అయితే. మార్కస్ స్టోయినిస్ 20వ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాదడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 245 రన్స్ కొట్టింది.