న్యూఢిల్లీ: జ్యూరిచ్ వేదికగా జరుగుతున్న గ్రాస్హోపర్ కప్ స్వాష్ టోర్నీలో భారత యువ ప్లేయర్ అభయ్‌సింగ్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల క్వార్టర్స్‌లో అభయ్ 10-12, 9-11తో ప్రపంచ చాంపియన్ కరీమ్ గవాద్(ఈజిప్టు) చేతిలో పోరాడి ఓడాడు.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తొలుత 0-6తో వెనుకంజలో నిలచిన అభయ్ అద్భుతంగా పుంజుకుని పోటీలోకి వచ్చాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింగ్ తొలి గేమ్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. రెండో గేమ్‌లోనూ అదే దూకుడు కొనసాగించిన ఈ యువ ప్లేయర్‌కు కరీమ్ నుంచి చుక్కెదురైంది.