బెంగళూరు: రాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ నుంచి బౌలర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇకనుంచి బౌలర్లు ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ వేస్తే వారు మ్యాచ్‌లో మళ్లీ బంతినందుకునే అవకాశమే లేకుండా బీసీసీఐ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతిపాదనల మేరకు బీసీసీఐ.. అన్ని రాష్ర్టాల అసోసియేషన్లకు జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది.
అయితే ఈ విషయంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్లదే తుది నిర్ణయం కానుంది. ఇక ఆట ముగింపునకు సంబంధించి కూడా కీలక మార్పులు చేసింది. మ్యాచ్ ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ చేసే జట్టు వికెట్ కోల్పోతే ఆ ఓవర్ పూర్తయితేనే ఆటను ముగించాలి. ప్రస్తుతం ఆట ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ టీమ్ వికెట్ కోల్పోతే ఆటను అక్కడే నిలిపేస్తున్నారు. అంతేగాక ఇకనుంచి దేశవాళీల్లో వన్డేలు జరుగుతున్నప్పుడు డ్రింక్స్ సమయాల్లో హెడ్‌కోచ్‌ను మైదానంలోకి అనుమతించనున్నారు.