హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఢిల్లీ వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్‌గేమ్స్ స్విమ్మిం గ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. పోటీలకు తొలి రోజైన బుధవారం జరిగిన బాలికల అండర్-19 800మీ ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన వ్రితి 9:29:01సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. షిరిన్(ఐఎస్‌సీఈ), పాటిల్ డాలీ(మహారాష్ట్ర) వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు బాలుర 800మీ ఫ్రీస్టయిల్లో సోమ్‌దేవ్ టాప్‌లో నిలిచాడు.