Paris Olympics | మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ క్వాలిఫికేషన్ రౌండ్లో భారత్ భారీ ఆశలు పెట్టుకున్న సిఫ్ట్‌కౌర్ సమ్ర తీవ్రంగా నిరాశపరిచింది. 32 మంది పాల్గొన్న ఈ రౌండ్లో ఆమె 31వ స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్లో వెటరన్ అంజుమ్ గాడ్గిల్ 18వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఆర్చరీ పురుషుల విభాగంలో ఉన్న ఏకైక ఆర్చర్ ప్రవీణ్ జాదవ్.. 0-6తో కవొ వెంచవొ (చైనా) ఓటమిపాలయ్యాడు. అథ్లెటిక్స్ విభాగంలో భాగంగా పురుషుల 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో వికాస్ సింగ్ (30), బిసత్ (37) టాప్-25లోకి కూడా రాలేదు. మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 41వ స్థానంతో ముగించింది. సెయిలింగ్ మెన్స్ కేటగిరీలో శరవణన్ 25వ స్థానంలో నిలిచాడు.
ఇక హాకీలో క్వార్టర్స్ దిశగా సాగుతున్న భారత్‌కు బెల్జియం షాకిచ్చింది. పూల్ బీ నాలుగో మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌పై గెలిచింది. 18వ నిమిషంలో అభిషేక్ గోల్ చేయగా బెల్జియం నుంచి జాన్ (33), డొహ్మెన్ (44) రెండు గోల్స్ కొట్టారు. టేబుల్ టెన్నిస్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన ఆకుల శ్రీజ.. 0-4తో సున్ యింగ్ష (చైనా) చేతిలో ఓటమిపాలైంది.