హైదరాబాద్, ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరుగుతున్న 37వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన ప్లేయర్లు అదరగొడుతున్నారు. సోమవారం జరిగిన బాలికల మిక్స్డ్ రిలే 4X400 మీటర్ల విభాగంలో భాగ్యలక్ష్మి రజత పతకంతో మెరిసింది. బాలుర ట్రయథ్లాన్లో వంశీ సిర్పూర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. విద్యార్థులు పతకాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్లు నాగపురి రమేవ్, షాజీ, నాగరాజును యాజమాన్యం అభినందించింది.