2026 Football World Cup: 2026 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ డ్రా విడుదల.. అల్జీరియాతో అర్జెంటీనా ఫస్ట్ మ్యాచ్
2026 Football World Cup: 2026 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ డ్రా విడుదలైంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో టోర్నీ జరగనున్నది. 12 గ్రూపుల్లో జట్లు పోటీపడనున్నాయి. అల్జీరియాతో అర్జెంటీనా తన ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నది.
వాషింగ్టన్: వచ్చే ఏడాది ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ జరగనున్నది. దీని కోసం వాషింగ్టన్ డీసీలో తుది డ్రా చేశారు. ఆ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. మొత్తం మూడు దేశాలు వచ్చే ఏడాది ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ నిర్వహించనున్నాయి. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో ఆ మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 48 దేశాలు వరల్డ్‌కప్‌లో తలపడనున్నాయి. 2026 జూన్ 11వ తేదీన టోర్నీ ప్రారంభంకానున్నది. మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గత చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్‌ను డిఫెండ్ చేసుకునేందుకు ట్రై చేయనున్నది. మేటి ప్లేయర్ లియోనల్ మెస్సీకి చెందిన అర్జెంటీనా తన తొలి మ్యాచ్‌లో అల్జీరియాతో తలపడనున్నది. కేప్ వర్డీ, కురకావో, జోర్డాన్, ఉజ్బకిస్తాన్ దేశాల్లో తమ గ్రూపు ప్రత్యర్థులు ఎవరో తెలుసుకున్నారు. నాలుగు సార్లు చాంపియన్‌షిప్ గెలిచిన జర్మనీతో కురకావో తన ఫస్ట్ మ్యాచ్‌లో పోటీపడనున్నది.
టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌కు మెక్సికో వేదిక కానున్నది. మెక్సికో సిటీలో ఉన్న అజ్టెకా స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. గ్రూపు ఏలో జూన్ 11వ తేదీన దక్షిణాఫ్రికాతో ఆ మ్యాచ్ ఉండనున్నది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే 42 జట్లు ఖరారు అయ్యాయి. ఇక ప్లేఆఫ్స్ లో ఉన్న ఆరు బెర్తుల కోసం 22 జట్లు పోటీపడనున్నాయి. వాటి ఫలితాలు మార్చి 31వ తేదీ వరకు తెలుస్తుంది. క్వార్టర్ ఫైనల్స్ నుంచి అన్ని మ్యాచ్‌లను అమెరికాలో నిర్వహించనున్నారు. జూలై 19వ తేదీన న్యూజెర్సీలోని ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.
1966లో వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ ఈసారి తన ఫస్ట్ మ్యాచ్‌లో క్రొయేషియాతో ఆడనున్నది. గ్రూప్ ఎల్లో ఘనా, పనామా దేశాలు కూడా ఉన్నాయి. ఈసారి మొత్తం 12 గ్రూపుల్లో జట్లు పోటీపడనున్నాయి. ఒక్కొక్క గ్రూపులో నాలుగేసి జట్లు ఉంటాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

