Virat Kohli | కోహ్లీ అసాధారణ ఫీట్.. ఒక్క బంతికే 14 రన్స్ కొట్టిన విరాట్
Virat Kohli | బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన మ్యాచ్‌లో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చెలరేగి ఆడాడు. 97 బంతుల్లో 103 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అసాధారణ ఫీట్‌ను సాధించాడు. కేవలం ఒక లీగల్ డెలివరీలో 14 పరుగులు రాబట్టి సంచలనం సృష్టించాడు.
Virat Kohli | అద్భుత బౌలింగ్‌కు అంతకుమించిన ఫీల్డింగ్ తోడవడంతో.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమ్ఇండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో వీరవిహారం చేస్తూ విజయకేతనం ఎగరవేసింది. హ్యాట్రిక్ విజయాలు ఖాతాలో వేసుకొని పుణెలో అడుగుపెట్టిన రోహిత్ సేన గురువారం జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ (Bangladesh)ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 261 పరుగులు చేసింది.
చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చెలరేగి ఆడాడు. 97 బంతుల్లో 103 నాటౌట్‌గా నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయ సెంచరీతో చెలరేగాడు. దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అసాధారణ ఫీట్‌ను సాధించాడు. కేవలం ఒక లీగల్ డెలివరీలో 14 పరుగులు రాబట్టి సంచలనం సృష్టించాడు.
13వ ఓవర్లో హసన్ వేసిన తొలి బంతికి రెండు పరుగులు తీశాడు కోహ్లీ. అయితే ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఫ్రీ హిట్ బంతిని కోహ్లీ ఫోర్ కొట్టాడు. కానీ ఆ బంతిని కూడా నోబాల్‌గా ప్రటించారు. ఇక ఆ తర్వాత ఫ్రీ హిట్ బంతికి కోహ్లీ సిక్సర్ కొట్టాడు. దీంతో ఒక్క లీగల్ డెలివరీకే కోహ్లీ 14 రన్స్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
Also Read..
CWC | చేజింగ్ మాస్టర్ కోహ్లీ.. బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా సాధికారిక విజయం
Sara Tendulkar | శుభ్‌మన్ కోసం సారా స్టేడియంలో వాలిపోయిన సారా టెండూల్కర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

