Jasprit Bumrah | మహ్ముదుల్లా కాదు.. ఆ బంతికి బ్రాడ్‌మన్ అయినా ఔటవ్వాల్సిందే! .. బుమ్రా యార్కర్‌పై సూపర్ కామెంట్
Jasprit Bumrah | రీఎంట్రీలో అదరగొడుతున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. వరల్డ్‌కప్‌లో తన వేగంతో పాటు.. పరుగుల కట్టడితో దుమ్మురేపుతున్న బుమ్రా.. బంగ్లాదేశ్‌తో పోరులో విశ్వరూపం కనబర్చాడు. తొలి స్పెల్‌లో వికెట్ తీయలేకపోయిన బుమ్రా.. రెండో స్పెల్‌లో బౌలింగ్‌కు వచ్చి ముష్ఫికర్ రహీమ్‌తో పాటు, మహ్ముదుల్లాను పెవిలియన్‌కు పంపాడు.
Jasprit Bumrah | రీఎంట్రీలో అదరగొడుతున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. వరల్డ్‌కప్‌లో తన వేగంతో పాటు.. పరుగుల కట్టడితో దుమ్మురేపుతున్న బుమ్రా.. బంగ్లాదేశ్‌తో పోరులో విశ్వరూపం కనబర్చాడు. తొలి స్పెల్‌లో వికెట్ తీయలేకపోయిన బుమ్రా.. రెండో స్పెల్‌లో బౌలింగ్‌కు వచ్చి ముష్ఫికర్ రహీమ్‌తో పాటు, మహ్ముదుల్లాను పెవిలియన్‌కు పంపాడు. ఇందులో రవీంద్ర జడేజా పట్టిన సూపర్ క్యాచ్‌కు ముష్ఫికర్ పెవిలియన్ బాట పట్టగా.. మహ్ముదుల్లా అయితే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
బుమ్రా వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతికి మహ్ముదుల్లా ఔటయ్యాడు. ఈ బంతి ఎంత ఫర్ఫెక్ట్ యార్క్ అంటే.. అది చూస్తే తప్ప చెప్పడం కష్టం. బుమ్రా బంతి వేసి తనదైన శైలిలో ఓ చిన్న స్మైల్ ఇవ్వగా.. అసలు దాన్ని ఎలాఆడాలో, ఎలా అడ్డుకోవాలో కొంచం కూడా అర్థం చేసుకోలేకపోయిన మహ్ముదుల్లా నిచ్చేష్టుడిగి పెవిలియన్ బాట పట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న మహ్ముదుల్లా ఈ బంతికి అవాక్కయ్యాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించగా.. అసలు ఆ బంతికి మహ్ముదుల్లా కాదు.. సర్ డాన్ బ్రాడ్‌మన్ ఉన్నా ఆడలేడని మరో వ్యాఖ్యాత అభిప్రాయపడ్డాడు.
హార్దిక్ దూరమైనా..!
గాయం కారణంగా హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోయినా.. మిగిలిన బౌలర్లంతా కలిసి కట్టుగా కదంతొక్కారు. ఫలితంగా బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ ఆకట్టుకుంది. మెహదీ హసన్ మిరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ల వెనక కేఎల్ రాహుల్ కండ్లు చెదిరే రీతిలో అందుకోగా.. ఇక ముష్ఫికర్ క్యాచ్‌ను రవీంద్ర జడేజా పక్షిలా ఎగురుతూ ఒడిసిపట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

