లాస్ఏంజెల్స్: ఎన్బీఏ చాంపియన్‌షిప్‌లో లెబ్రాన్ జేమ్స్ అత్యధిక పాయింట్ల రికార్డును సొంతం చేసుకున్నాడు. నాలుగు దశాబ్దాలుగా లెజెండ్ కరీం అబ్దుల్ పేరిట ఉన్న రికార్డు (38,387 పాయింట్లు)ను అధిగమించి కొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఓక్లహామా థండర్స్‌తో జరిగిన పోరులో లాస్ ఏంజెల్స్ 130-133తో ఓడినప్పటికీ మూడో క్వార్టర్లో లెబ్రాన్ 36 పాయింట్లు సాధించి ఎన్బీఏలో 38,390 పాయింట్లకు చేరి అగ్రస్థానంలో నిలిచాడు.