Naya Mall | ఈ కీబోర్డుతో ల్యాప్‌టాప్, ఫోన్ రెండూ ఒకేసారి కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు!
Naya Mall | కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణమైనా గడవని యుగమిది. టైపింగ్ అన్నది అందరి వేళ్లకూ అత్యవసర విద్య అయిపోయింది. అందుకే కీ బోర్డుల్లోనూ వెరైటీలు వస్తున్నాయి. ఎప్పుడూ మనం చూసే నాలుగు పలకల కీస్‌కు భిన్నంగా చిన్న గులకరాళ్లను పేర్చినట్టు కనిపించేలా.. లాజిటెక్ సంస్థ ‘పెబుల్ 2 కాంబో’ పేరిట కీబోర్డు, మౌస్ సెట్‌ను తీసుకొచ్చింది.
Naya Mall | కీబోర్డు మూడింటికీ..
కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణమైనా గడవని యుగమిది. టైపింగ్ అన్నది అందరి వేళ్లకూ అత్యవసర విద్య అయిపోయింది. అందుకే కీ బోర్డుల్లోనూ వెరైటీలు వస్తున్నాయి. ఎప్పుడూ మనం చూసే నాలుగు పలకల కీస్‌కు భిన్నంగా చిన్న గులకరాళ్లను పేర్చినట్టు కనిపించేలా.. లాజిటెక్ సంస్థ ‘పెబుల్ 2 కాంబో’ పేరిట కీబోర్డు, మౌస్ సెట్‌ను తీసుకొచ్చింది. విభిన్న రంగుల్లో వస్తున్న ఈ కీబోర్డుల్లో కీస్ వెరైటీగా ఉండటమే కాదు, దీన్ని ఎంచక్కా మన దగ్గరున్న మూడు డివైజ్లకూ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్, ట్యాబ్‌లాంటి వాటికి బ్లూటూత్ సాయంతో ఈ కీబోర్డును అనుసంధానించవచ్చు. వాటి ద్వారానూ సులభంగా కంటెంట్ రాసుకోవచ్చు. పది ప్రత్యేకమైన మీటలు స్క్రీన్ షాట్, కాపీ పేస్ట్‌లాంటి వాటికి షార్ట్‌కట్ కీస్గా పనికొస్తాయి. వీటన్నిటి కోసం లాజిటెక్ ఒక యాప్‌ను కూడా తీసుకొచ్చింది. టైప్ చేస్తున్నప్పుడు టకటకల శబ్దమూ పెద్దగా ఉండదు. ఈ కీబోర్డు బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ధర సుమారు అయిదు వేల రూపాయలు. logitech.com లో లభిస్తుంది.
పాండా కోట్
నలుపు తెలుపు రంగుల్లో ముద్దుగా కనిపించే పాండా అంటే చాలా మందికి ఇష్టం. దాని కాంబినేషన్ మనసులో పెట్టుకుని అంతే అందంగా ఓవర్ కోట్‌ను తయారుచేసింది కా-షా సంస్థ. ‘పాండా ఓవర్లే’ పేరిట తీసుకొచ్చిన దీనిమీద జామెట్రిక్ ఆప్లిక్ ప్రింట్లు ఉన్నాయి. పైన చేతితో ఎంబ్రాయిడరీ చేసి, అద్దాలు కుట్టి రూపొందించారు. ఈ జాకెట్‌ను రివర్సబుల్గా ఉపయోగించుకోవచ్చు. అంటే దీనిమీద ఒకవైపు ఒక రకం డిజైన్, మరోవైపు ఇంకో తరహా ప్రింట్ ఉంటాయి. మనకు నచ్చినట్టు రెండు వైపులా వేసుకోవచ్చన్న మాట. ఫ్యాషనబుల్ దుస్తుల మీదికి బాగుండే ఈ జాకెట్ విలువ రూ. 75,000. ka-sha.com ద్వారా ఖరీదు చేయవచ్చు.
కళ్లజోడే… కాస్త ఓవర్!
సన్‌గ్లాసెస్ అంటేనే ఫ్యాషన్ ప్రియులకు పేటెంట్. ఇక, ఫ్యాషనేమో.. కొంచెమన్నా ఓవర్ చేయకపోతే, కాస్తన్నా చిత్రంగా కనిపించకపోతే నేను నేనెందుకవుతానూ అనుకుంటుందాయే. అందుకే ఇప్పుడు, లోయెవే సంస్థ తయారు చేసిన ‘ఇన్ఫ్లేటెడ్ ఓవర్ సైజ్డ్ సన్ గ్లాసెస్’ ఫ్యాషన్ అరలో చేరిపోయాయి. అద్దం చుట్టూ ఫ్రేమ్ పెద్దగా, ఉబ్బినట్టు ఉండటం వీటి ప్రత్యేకత. ఎక్కువకాలం మన్నేలా ఎసిటేట్ ఫ్రేమ్‌తో తయా౮చేశారు. చతురస్రం, దీర్ఘచతురస్రం, క్యాట్ఐ లాంటి విభిన్న ఆకృతుల్లో.. పసుపు, ఎరుపులాంటి నిండు రంగుల్లో రూపొందిస్తున్నారు. దీంతో చూడగానే చిన్న పిల్లలు పెట్టుకునే బొమ్మ కళ్లజోళ్లను పోలి చిత్రంగా కనిపిస్తాయి. ఖరీదు మాత్రం సుమారు ముప్పై వేల రూపాయలు. matchesfashion.comలో ఇవి దొరుకుతాయి.
వజ్రమంటి పెట్టె
పెట్టెలో వజ్రాలు పెట్టుకోవడం తెలుసు, కానీ పెట్టే వజ్రంలా ఉండటం కొత్త మాటే. ఏం చేసినా ప్రత్యేకంగా ఉండాలనుకునే రెండు బ్రాండెడ్ సంస్థలు కలిసి ఈ తరహా వ్యానిటీ బాక్సులను తయారు చేస్తున్నాయి. విలాసవంతమైన నగల తయారీ సంస్థ టిఫనీ, లగేజ్ కంపెనీ రిమోవా సంయుక్తంగా ‘రిమోవా x టిఫనీ క్యాప్సూల్ కలెక్షన్’ పేరిట ఈ తరహా పెట్టెలను తీసుకువచ్చాయి. అల్యూమినియం, పాలీకార్బొనేట్లతో తయారైన ఈ వ్యానిటీ బాక్స్ పై భాగాన్ని వజ్రం తరహా కటింగులతో తళతళలాడేలా తీర్చిదిద్దారు. రకరకాల నగలు ఉంచేందుకు వీలుగా.. తీసి పెట్టుకునే అరలూ ఉంటాయి. ముస్తాబు చూసుకోవడానికి అద్దమూ ఉంది. ప్రియమైన వారికి ఖరీదైన కానుకగా ఇవ్వడానికి అనువైనది. ధర లక్షా తొంభై వేల రూపాయలు. tiffany.com, rimowa.comలో కొనుగోలు చేయవచ్చు.
Read More :
Naya Mall | ఫెరారీ నుంచి అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

