Xiaomi EV Scooter 4Ultra | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ.. మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ 4-ఆల్ట్రా (4 Ultra)ని ఆవిష్కరించింది. 500 వాట్ల సామర్థ్యం గల మోటార్‌తో వస్తున్నది. ఇది 940 వాట్ల విద్యుత్ వెలువరిస్తుంది. గంటకు 25 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. నాలుగు రైడ్ మోడ్ల్లో లభ్యం అవుతుంది. 561.5 వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ గల ఈ స్కూటర్.. సింగిల్ చార్జ్ చేస్తే 70 కి.మీ. వరకు ప్రయాణం చేయొచ్చు. పూర్తి చార్జి చేయడానికి 6.5 గంటలు పడుతుంది. పవర్ అడాప్టర్ అందిస్తారు.
షియోమీ హోం, మీ హోం యాప్స్‌తో మీరు ప్రయాణం చేసిన దూరాన్ని, మిగిలిన దూరాన్ని అంచనా వేయొచ్చు. స్మూత్‌గా నడిపేందుకు డ్యుయల్ సస్పెన్షన్ సిస్టమ్, 10-ఇన్ షియోమీ డ్యూరాజెల్ టైర్స్ వితౌట్ ట్యూబ్‌లెస్, సెల్ఫ్ సీలింగ్‌తో వస్తున్నది. ఈ-ఏబీఎస్, డ్రమ్ బ్రేకింగ్తోపాటు డార్క్‌లో హెడ్‌లైట్, టెయిల్ లైట్ సాయంతో చేయొచ్చు. 800 సీఎం2 వెడల్పు, 170 ఎంఎం పొడవు డెక్, హయ్యర్ అండ్ బ్రాడర్ 550 ఎంఎం హ్యాండిల్ బ్యార్తో సౌకర్యవంతంగా రైడ్ చేయొచ్చు. షియోమీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4ఆల్ట్రా కారు ధర 1055 డాలర్లు. మన కరెన్సీలో రూ.87,585 పలుకుతుంది. ఐపీ55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లతో వస్తున్నది.