iPhone: సెలబ్రిటీలు ఐఫోన్‌నే ఎందుకు వాడుతారు..?
సెలబ్రిటీలందరూ దాదాపు ఐఫోన్ వాడుతుంటారు. ధర ఎక్కువైనా మార్కెట్లలోకి వచ్చే కొత్త మోడల్స్ కొనుగోలు చేస్తుంటారు. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ ప్రోడక్ట్స్ చాలా ఖరీదు.
సెలబ్రిటీలందరూ దాదాపు ఐఫోన్ వాడుతుంటారు. ధర ఎక్కువైనా మార్కెట్లలోకి వచ్చే కొత్త మోడల్స్ కొనుగోలు చేస్తుంటారు. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ ప్రోడక్ట్స్ చాలా ఖరీదు. అయితే సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఐఫోన్‌నే వాడేందుకు గల ప్రత్యేక కారణాలేంటో తెలుసుకుందాం..
సెక్యూరిటీ: డేటా గోప్యతకు సంబంధించి భద్రత కల్పించడంలో యాపిల్ రాజీపడదు. వినియోగదారుల డేటా గోప్యతకు సంబంధించి సెక్యూర్ డిజిటల్(SD) కార్డులను ఈ కంపెనీ ఉపయోగించదు. సాధారణంగా థర్డ్ పార్టీ యాప్‌లు యూజర్స్ నుంచి వారి అనుమతి తీసుకొని డేటా దొంగింలించేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ యాపిల్‌లో అలా చేయడం కుదరదు. ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ విషయంలో తప్పితే యూజర్ల డేటా వాడదు. అంతేకాకుండా మిగతా ఫోన్లతో పోలిస్తే ఐఫోన్లను హ్యాక్ చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు.
కెమెరా: ఐఫోన్లో కెమెరాకు ప్రత్యేక స్థానం ఉంది. మిగతా ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ కెమెరాల్లో ఫొటోలు అద్భుతంగా వస్తాయి. ఇందుకోసం యాపిల్ కంపెనీ అత్యుత్తమైన లెన్స్‌ను కెమెరాల్లో ఉపయోగిస్తోంది. ఐఫోన్‌తో ఫొటో తీస్తే వచ్చే కలర్స్, ఎక్స్‌ప్లోరర్, వీడియోలు సైతం చాలా సహజంగా ఉంటాయి. ఎలాంటి ఎడిటింగ్ అవసరం లేకుండా డైరెక్టుగా ఐఫోన్‌తో తీసిన ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేస్తుంటారు.
యూజర్ ఫ్రెండ్లీ: ఐఫోన్‌కు ప్రత్యేక ఐఓఎస్ ఉంటుంది. ఇది సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే వేగంగా పనిచేస్తుంది. ఐకాన్స్, ఫాంట్స్, కలర్స్ అన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఐఓఎస్‌లో ఒకేసారి మల్టీ ట్యాబ్స్ ఓపెన్ చేసినా ఫోన్ హ్యాంగ్ కాదు.
సాఫ్ట్వేర్ అప్డేట్స్: మిగతా ఫోన్లకు యాపిల్ ఫోన్లకి పెద్ద తేడా ఇక్కడే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఓఎస్‌లో ఎలాంటి అప్డేట్ అయినా అన్ని డివైజ్‌లలోకి వేగంగా అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా యాపిల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. అందుకే సెలబ్రిటీలు ఈ బ్రాండ్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
కనెక్టివిటీ: యాపిల్ ఫోన్, కంప్యూటర్, వాచ్ ఇలా అన్నీ యాపిల్ కంపెనీకి చెందినవే అయితే దాన్ని యాపిల్ ఎకో సిస్టమ్ అంటారు. వీటన్నింటినీ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫోన్లోని సమాచారం కంప్యూటర్లోని, అక్కడి నుంచి వాచ్‌లోకి సులభంగా మార్చుకోవచ్చు. ఈ రకమైన వెసులుబాటు వల్ల ఫోన్ మన దగ్గర లేకపోయినా మ్యాక్బుక్లోంచి కాల్స్ మాట్లాడొచ్చు.
సర్వీస్ సెంటర్: యాపిల్ ప్రోడక్ట్స్‌లలో ఏదైనా సమస్య తలెత్తినపుడు కేవలం యాపిల్ సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సర్వీస్ సెంటర్లలో డేటా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండదు. మిగతా ఫోన్ యూజర్లు ఎక్కడైనా రిపేర్ చేయవచ్చు. కానీ.. అందులోని ఇన్ఫర్మేషన్ ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా గుర్తించేందుకు వీలండదు.
ఈ రకమైన సదుపాయాల వల్ల సెలబ్రిటీలు ఎక్కువగా యాపిల్ ఐఫోన్స్ ఉపయోగిస్తుంటారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

