న్యూయార్క్ : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అదిరే అప్డేట్ అందుబాటులోకి రానుంది. ట్విట్టర్ కంటే ముందుగా వాట్సాప్‌లో ఎడిట్ బటన్‌ను డెవలప్ చేసేందుకు కసరత్తు సాగుతోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో డెడికేటెడ్ ఎడిట్ ఆప్షన్ లేదు. ఎడిట్ బటన్ అందుబాటులోకి వస్తే మెసేజ్‌లు పంపిన తర్వాత కూడా వాటిని ఎడిట్ చేసే వెసులుబాటు కలుగుతుంది.
వాట్సాప్ వ్యవహారాలను ట్రాక్ చేసే వెబ్సైట్ వెబ్టాఇన్ఫోలో ఈ ఫీచర్ కనిపించింది. మనం పంపే మెసేజ్‌ల ప్రక్రియలో వాట్సాప్ భారీ మార్పుల దిశగా కసరత్తు సాగుతోంది. ప్రస్తుతం డెవలప్ అవుతున్న ఎడిట్ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను వెబ్‌టాఇన్ఫో షేర్ చేసింది. మీరు పంపిన మెసేజ్‌ను సెలెక్ట్ చేయగానే డెడికేటెడ్ ఎడిట్ ఆప్షన్ ఈ స్క్రీన్‌షాట్‌లో కనిపిస్తుంది.
కాపీ, ఫార్వార్డ్ మెసేజ్‌లతో పాటు యూజర్లు ఎడిట్ ఆప్షన్ కూడా పొందవచ్చు. ఎడిట్ బటన్ సెలెక్ట్ చేసిన వెంటనే మీ మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుత సెటప్‌కు అనుగుణంగా యూజర్లు మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. ఒకసారి పంపిన టెక్ట్స్ మెసేజ్‌లను అన్‌సెండ్ లేదా ఎడిట్ చేసుకునే వెసులుబాటు లేదు.