WhatsApp | మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించడానికి కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నది. మెసేజింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా గ్రూప్ కాలింగ్, పేమెంట్స్, ఫొటో ఎడిట్ తదితర ఫీచర్లు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. తాజాగా మరో మూడు ఫీచర్లు అందుబాటులోకి తేనున్నది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఒకేసారి 100 మీడియా ఫైల్స్ షేర్ చేసే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ నుంచి 30కి మించి మీడియా ఫైల్స్ షేర్ చేయడానికి ఉండదు. తాజాగా ఫీచర్ అప్డేట్లో భాగంగా ఈ లిమిట్ 100 ఫైల్స్‌కి పెంచుతున్నట్లు వెల్లడించింది.
వర్జినల్ క్వాలిటీతో ఇమేజ్‌లు షేరింగ్ చేసుకోవడంతోపాటు క్యూఆర్ కోడ్ ఉపయోగించి చాట్ హిస్టరీ ఇతరులకు బదిలీ చేసే అవకాశం తీసుకొస్తున్నది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ డేటా సేవ్ చేయడానికి శరవేగంగా ట్రాన్స్ ఫర్ చేయడానికి ఫొటోను కంప్రెస్ చేయాల్సి వస్తున్నది. తాజా అప్ డేట్ ప్రకారం ఒర్జినల్ క్వాలిటీతో హై రిజొల్యూషన్ ఫొటోలు షేర్ చేయొచ్చు. ఫొటోల షేరింగ్‌కు ముందే ఒరిజినల్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
ఒకేసారి 100 ఫైల్స్ పంపేందుకు రూపొందించిన ఫీచర్ ప్రస్తుతం తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఇప్పటికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రాకుంటే యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫీచర్ అప్ డేట్ చేసుకోవాలి. వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.4.3 వర్షన్ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఈ ఫీచర్‌ను ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ పేర్కొంది.
వాట్సాప్ చాట్‌లో తరుచుగా ఫోటోలు షేర్ చేసేవారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇటీవలే వాట్సాప్ తన యూజర్లకు వీడియో మోడ్ ఫీచర్ పరిచయం చేసింది. ఇంతకుముందు మాదిరిగా యూజర్లు వీడియో రికార్డింగ్ కోసం కెమెరా బటన్ నొక్కి పెట్టాల్సిన అవసరం ఉండదు. రికార్డింగ్ బటన్ మీద క్లిక్ చేస్తే సరి. దీంతోపాటు వర్జినల్ క్వాలిటీలో ఫొటోలు షేర్ చేసుకునేలా వాట్సాప్ కొత్త అప్ డేట్ తీసుకు రానున్నది.
ఇక నుంచి గూగుల్ డ్రైవ్ వాడకుండానే న్యూ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా చాట్ హిస్టరీ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తే సరిపోతుంది. బ్యాకప్ చాట్లకు వెళ్లి, గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయకుండా నేరుగా ట్రాన్స్ ఫర్ చేసేయొచ్చు. అయితే, ఎప్పుడు ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామన్న సంగతి మాత్రం వాట్సాప్ వెల్లడించలేదు.