ఇది 5జీ కంటే 100 రెట్లు వేగవంతమైన టెక్నాలజీ.. ప్రత్యేకతలేంటో తెలుసా !
5G Spectrum Auction | 2జీ, 3జీ, 4జీ.. ఇప్పుడు 5జీ కూడా వచ్చేస్తున్నది. 5జీ మాత్రమే కాదు 6జీ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నదని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇప్పటికే అంతర్జాతీయ టెలికం సంస్థలు ఆరో జనరేషన్‌పై దృష్టి కేంద్రీకరించాయి. టెలికం రంగంలో పోటీని తట్టుకొని నిలిచేందుకు వినియోగదారులకు సౌకర్యవంతమైన టెక్ సదుపాయాలను కల్పించేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయి. అందులోభాగంగానే 6జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
6G .. వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో ఆరో జనరేషన్ ఇది. ఇది అత్యంత, భారీ పౌనఃపున్యం ఉన్న తరంగాలను( THF ) ( Submillimeter Waves ) ఉపయోగించుకోనున్నది. దీని వేగం 5జీ కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 6జీతో ఒక సెకనుకు 1 టెరాబైట్ డేటా రేట్ ఉంటుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటిక్స్ రంగాలకు తగ్గ సామర్థ్యాన్ని 6జీ కలిగి ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. రియల్ టైం డేటా, బిగ్ డేటా పనితీరును అమాంతం పెంచేస్తుందని వివరించారు. సెన్సింగ్, ఇమేజింగ్, డిప్లేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు అత్యాధునికతను సంతరించుకొంటాయని తెలిపారు. ఎక్స్ టెండెడ్ రియాలిటీ, మొబైల్ హోలోగ్రామ్ చూసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
మొబైల్లో హోలోగ్రామ్ చూడొచ్చు
6జీతో మొబైల్లోనే హోలోగ్రామ్ చూసే వీలు కలుగనున్నది. వాస్తవానికి హోలోగ్రామ్‌ను మొబైల్లో చూడాలంటే 580 జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ అవసరం. 6జీతో అది సాధ్యం కానున్నది. సైన్స్ ఫిక్షన్ అనుకొనే ఎన్నో అంశాలను 6జీ ద్వారా నిజం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
6జీ ఎప్పుడొస్తుంది?
వాణిజ్యపరంగా 2030 నాటికి 6జీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నా, టెక్నాలజీని కరోనా ఇంకాస్త ముందుకు తోసింది. ఈ పర్యవసానంతో మరో మూడేండ్లలో మనం 6జీ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
6జీ ఉపయోగాలివీ..
- ఆరోగ్య పర్యవేక్షణ
- వేగవంతమైన ఫేషియల్ రికగ్నిషన్
- గాలి నాణ్యత కొలతలో కచ్చితత్వం
- గ్యాస్, టాక్సిసిటీ సెన్సింగ్
- మొబైల్ టెక్నాలజీ… తదితరాలు
6జీ – ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సరికొత్త రికార్డు
6జీ సిగ్నల్ ద్వారా 100 మీటర్ల వరకు డేటాను పంపించి ప్రముఖ దక్షిణ కొరియా సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రికార్డు సృష్టించింది. కొన్ని నెలల క్రితం 15 మీటర్ల వరకు డేటాను పంపించగా, ఆ రికార్డును తాజాగా బద్దలు కొట్టింది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
7G వైపు కూడా అడుగులు పడుతున్నయా?
ప్రపంచవ్యాప్తంగా 5జీ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అప్పుడే 6జీ గురించి చర్చ జరుగుతున్నది. అయితే.. 7జీ వైపు పరిశోధకులు అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.
Read More :
“త్వరలోనే భారత్‌లోకి 5జీ సేవలు.. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? 4జీతో పోలిస్తే లాభమా? నష్టమా?”
“3జీ, 4జీ, 5జీ తెలుసు.. మరి ‘జీరో’ జీ ఉందని తెలుసా !”
“సెల్ఫోన్లు, టవర్లతో ఆరోగ్యం దెబ్బతింటుందా? అసలు రేడియేషన్ అంటే ఏంటి?”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- 5G
- 5G service
- 5G Technology
- 6g
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

