హైదరాబాద్: విదేశీ టూర్‌కు ప్లాన్ చేస్తున్నారా? విదేశీ భాషలో మాట్లాడలేమోనని ఆందోళన చెందుతున్నారా? మీకు ఆ బెంగ అవసరం లేదు. గూగుల్ ‘లిటిల్ లాంగ్వేజ్ లెసన్స్’తో (Little Language Lessons) ఎంతో ఈజీగా విదేశీ భాషలు నేర్చుకోవచ్చు. మీ బిజీ షెడ్యూల్‌తోపాటు చాలా తక్కువ సమయంలోనే ఎంచుకున్న ఫారిన్ లాంగ్వేజ్‌పై పట్టుసాధించవచ్చు. ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా దీనికి ఎంతో తోడ్పడతాయి.
కాగా, గూగుల్ ‘లిటిల్ లాంగ్వేజ్ లెసన్స్’ టూల్ ద్వారా విదేశీ భాషకు చెందిన పదజాలం, పదబంధాలు, వ్యాకరణ నియమాలు కూడా ఎంతో సులభంగా నేర్చుకోవచ్చు. అలాగే గూగుల్ ట్రాన్స్‌లేటర్‌తో కలిసి ఉన్న ఈ టూల్‌తో చాలా త్వరగా, తేలికగా విదేశీ భాషలో మాట్లాడవచ్చు. అనువాదం ద్వారా తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోవచ్చు. దీంతో విదేశీ భాషలోని అర్థం కాని పదాలను తెలుసుకోవడంతోపాటు ఆ భాషను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది.
మరోవైపు విదేశీ భాష ఉచ్ఛారణకు వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఎంతో సహాయపడుతుంది. ఒక పదాన్ని విశ్లేషించడంతోపాటు సరైన అనుకరణకు ఇది దొహదపడుతుంది. దీంతో గూగుల్ ‘లిటిల్ లాంగ్వేజ్ లెసన్స్’ టూల్ ద్వారా ఎంచుకున్న విదేశీ భాషను చాలా సులువుగా నేర్చుకోవడం, మాట్లాడటంతోపాటు తక్కువ సమయంలోనే దానిపై పూర్తిగా పట్టుసాధించవచ్చు.