Vivo X60 : వివో ఎక్స్60 ధర భారీగా తగ్గింపు.. రెండు వేరియంట్లలో ఎంత తగ్గించారంటే?
భారత మొబైల్ మార్కెట్లోకి వివో ఎక్స్60 గత ఏప్రిల్ నెలలో విడుదలైంది. రెండు వేరియంట్లలో లభించనున్న వివో ఎక్స్60 ఫోన్ ధరను ఇండియాలో తగ్గించారు. వివో ఎక్స్ 60 ప్రారంభ ధర 34,990 రూపాయలుగా ఉంది. 37,990 రూపాయల ధర ఉన్న 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమోరీ మోడల్‌ను రూ.34,990కే అందిస్తున్నారు. 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ ధర రూ. 41,990 కాగా.. ప్రస్తుతం రూ.39,990 కే అందిస్తున్నారు. తగ్గించిన ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి.

ఆగస్టు 31 వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్‌ను బుక్ చేసుకుంటే.. వివో మరికొన్ని అదనపు ఆఫర్లను కూడా అందించనున్నట్టు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కార్డులతో 10 శాతం అదనపు డిస్కౌంట్‌తో పాటు వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ చాన్స్ కూడా ఉంటుంది.

వివో అఫిషియల్ వెబ్సైట్లో ఈ ఫోన్‌ను బుక్ చేసుకుంటే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా 5000 వరకు క్యాష్ బ్యాక్‌తో పాటు.. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డీల్‌లో ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈకామర్స్ వెబ్సైట్లో 5 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

వివో ఎక్స్60 ఫీచర్స్ ఇవే
వివో ఎక్స్ 60 ఫీచర్ల విషయానికి వస్తే.. 6.5 ఇంచ్ ఫ్లెక్సిబుల్ ఏఎమ్వోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 240 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్, 398 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, స్కాట్ గ్జెన్సేషన్ అప్ స్క్రీన్ ప్రొటెక్షన్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ రేర్ కెమెరా 48 ఎంపీ, ఫ్రంట్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, కెమెరా యాప్‌లో ప్రత్యేకమైన మోడ్స్ నైట్, పోర్ట్రెయిట్, పానో, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ లాప్స్, ప్రో, ఏఆర్ స్టిక్కర్స్, సూపర్ మూన్, ఆస్ట్రో, ప్రో స్పోర్ట్స్, లాంగ్ ఎక్స్పోజర్, 5జీ, వైఫై విత్ ఎంఐఎంవో టెక్, బ్లూటూత్ 5.1, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి అద్భుతమైన ఫీచర్లతో వివో ఎక్స్60 విడుదలైంది.

Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

