న్యూఢిల్లీ : వాచ్ 2కు కొనసాగింపుగా బ్లూఓఎస్, 16 రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో వివో వాచ్ 3ని (Vivo Watch 3) వివో లాంఛ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ 1.43 ఇంచ్ రౌండ్ స్క్రీన్, పలు హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ క్యాపబిలిటీస్తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. వివో బ్లూఓఎస్, వాయిస్ కాల్స్ కోసం ఈసిమ్ సపోర్ట్, పలు కలర్, స్ట్రాప్ ఆప్షన్స్‌తో ఈ హాట్ డివైజ్ ముందుకొచ్చింది.
చైనాలో ఈ స్మార్ట్‌వాచ్‌ను వివో లాంఛ్ చేయగా భారత్ మార్కెట్లో ఎంట్రీపై కంపెనీ ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. థిన్నర్, స్టైలిష్ డిజైన్‌తో సులభంగా వాడేందుకు స్టెయిన్లెస్ స్టీల్ రొటేటింగ్ క్రౌన్, కుడివైపున బటన్‌తో పాటు కర్వ్డ్ గ్లాస్‌తో 3డీ ఎఫెక్ట్‌ను మరిపించేలా 1.43 ఇంచ్ రౌండ్ స్క్రీన్ ఆకట్టుకుంటుంది.
హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ2 సెన్సర్, అసాధారణ ఫ్లక్చువేషన్స్లో యూజర్లను అలర్ట్ చేసే ఫీచర్లతో పాటు స్లీప్, స్ట్రెస్ లెవెల్స్ ట్రాక్స్ వంటి హెల్త్ ఫీచర్లతో వివో వాచ్ 3 కస్టమర్ల ముందుకొచ్చింది. వివో వాచ్ 3 ఒకసారి చార్జింగ్ చేస్తే 16 రోజుల బ్యాటరీ లైఫ్ అందించేలా 505ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. ఈ వాచ్ మూన్లైట్ వైట్, స్టార్‌లైట్, బ్రైట్ మూన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ భారత కరెన్సీలో దాదాపు రూ. 15,000 నుంచి లభిస్తుంది.
Read More :
Retail Market | దేశీయ రిటైల్ మార్కెట్‌కు పండుగ కళ.. రూ.3.75 లక్షల కోట్ల అమ్మకాలు