న్యూఢిల్లీ : వివో నెక్ట్స్ జనరేషన్ వివో వీ25, వివో వీ25 ప్రొ స్మార్ట్ఫోన్ల కీలక స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. వివో 25ప్రొ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. ఇందులో మెరుగైన ఇమేజ్‌లు, క్వాలిటీ వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో (ఓఐఎస్) కూడిన 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఆకట్టుకోనుంది.
సెకండరీ కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) సపోర్ట్‌ను కలిగిఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక ముందు భాగంలో 32 ఎంపీ ఐ ఏఎఫ్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వివో వీ25 ప్రొ 66డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగిఉంటుంది. ఇక బ్యాక్ ప్యానెల్లో ఫ్లోరైట్ ఏజీ గ్లాస్‌తో కూడిన కలర్ ఛేంజింగ్ టెక్నాలజీ ఫీచర్ ఉంటుందని మరో లీక్ వెల్లడించింది.
ఇక ఫుల్ హెచ్డీ+ త్రీడీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుందని అంచనా వేస్తున్నారు. 8జీబీ ర్యాం, 12జీబీ ర్యాం వేరియంట్స్‌లో లభించే వివో వీ25 సిరీస్ రూ 40,000 లోపు భారత్‌లో అందుబాటులో ఉండనుంది.