Vivo T5x 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో తాజాగా ఇండియాలో టీ5ఎక్స్ పేరుతో 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్లైన్ స్టోర్, ఎంపిక చేసిన ఔట్లెట్లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
7,200 ఏంఏహెచ్ కెపాసిటీ కలిగిన పవర్ఫుల్ బ్యాటరీతోపాటు మీడియాటెక్ డిమెన్సిటీ 7,400 టర్బో చిప్సెట్ దీని ప్రత్యేకత. ఈ ఫోన్లోని ప్రధాన ఫీచర్లివి. 6.76 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డిమెన్సిటీ 7,400 టర్బో చిప్సెట్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, నానో డ్యయుల్ సిమ్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ బేస్డ్ ఒరిజిన్ ఓఎస్ 6.0, రెండేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, 50 ఎంపీ సోనీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ బొకే కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 219 గ్రాముల బరువు, 7,200 ఏంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ వంటివి ప్రధాన ఫీచర్లు. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.18,999 / రూ.20,999 / రూ.22,999.