న్యూఢిల్లీ : వివో టీ1ఎక్స్ ఇండియా లాంఛ్ తేదీ అధికారికంగా వెల్లడైంది. న్యూ వివో టీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఈనెల 20న లాంఛ్ కానుంది. మలేషియాలో లాంఛ్ అయిన డివైజ్ తరహాలో వివో టీ1ఎక్స్ ఇండియా వేరియంట్ ఉండనుంది. వివో లేటెస్ట్ టి సిరీస్ స్మార్ట్‌పోన్ బ్లూ, బ్లాక్ కలర్స్‌లో కస్టమర్ల ముందుకు రానుంది.
డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ రానుంది. వివో టీ1ఎక్స్ స్మార్ట్‌పోన్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ చిప్సెట్తో, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న వివో ఫోన్ 6.58ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీతో కస్టమర్ల ముందుకొస్తుంది.
కెమెరా సెన్సర్స్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. పోన్ ముందు భాగంలో 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా. ఇక భారత్‌లో వివో టీ1ఎక్స్ ధర రూ 15,000 వరకూ ఉంటుందని భావిస్తున్నారు.