Naya Mall | స్పీకర్‌గానే కాదు.. ఇయర్బడ్స్లానూ పనిచేస్తాయి.. ఈ 3 ఇన్ 1 డివైజ్ చూస్తే అవాక్కవాల్సిందే!
naya mall | జేబులో పెట్టుకుని వెళ్లిపోగలిగే స్పీకర్ల్ల హవా నడుస్తున్నది. బ్లూటూత్‌తో పనిచేసే వైర్లెస్ ఇయర్‌బడ్స్ రోజువారీగా మనం వాడుతున్న వస్తువుల్లో చేరిపోయాయి. అయితే, బ్లూటూత్ స్పీకర్‌లోనే ఈ ఇయర్ బడ్స్నూ ఉంచేలా సరికొత్త 3 ఇన్ 1 పరికరం మార్కెట్లోకి వచ్చింది.
Naya Mall | స్పీకర్‌లోనే ఇయర్ బడ్స్…
జేబులో పెట్టుకుని వెళ్లిపోగలిగే స్పీకర్ల్ల హవా నడుస్తున్నది. బ్లూటూత్‌తో పనిచేసే వైర్లెస్ ఇయర్‌బడ్స్ రోజువారీగా మనం వాడుతున్న వస్తువుల్లో చేరిపోయాయి. అయితే, బ్లూటూత్ స్పీకర్‌లోనే ఈ ఇయర్ బడ్స్నూ ఉంచేలా సరికొత్త 3 ఇన్ 1 పరికరం మార్కెట్లోకి వచ్చింది. ఇదే ఫోన్ స్టాండ్‌గానూ ఉపయోగపడుతుంది. వింగజాయ్ ఎస్పీ-840 పేరిట తయారు చేసిన ఈ పరికరాన్ని బ్లూటూత్ ద్వారా కానీ యూఎస్బీ, మైక్రో ఎస్డీల ద్వారా కానీ ఫోన్‌కి అనుసంధానించవచ్చు. కాబట్టి ఇయర్ బడ్స్ మన దగ్గర ఉంటే స్పీకరు, ఫోన్ స్టాండ్ కూడా ఉన్నట్టే! ధర రూ. 2,999. ఆర్డర్ చేయడానికి vingajoy.com క్లిక్ చేయండి.

క్యాండిల్ కొమ్మలు
ఇంటి అలంకరణలో దీపాల వెలుగులను భాగం చేసేవారు క్యాండిల్ హోల్డర్లను ప్రత్యేకంగా ఇష్టపడతారు. అందులోనూ రకరకాల వెరైటీలు మార్కెట్లో లభిస్తున్నాయి. మోడ్రన్ లుక్‌తో ఇంటికి సరిగ్గా సరిపోయేలా ఇటీవల మార్కెట్లోకి వచ్చింది.. ‘బ్రాస్ 6- బ్రాంచ్డ్ క్యాండిల్ హోల్డర్’. స్వీడిష్ డిజైనర్ జోసెఫ్ ఫ్రాంక్ రూపుదిద్దిన ఈ హోల్డర్ చెట్టు కొమ్మలను పోలి ఉంటుంది. మూడు కొమ్మలు ఒకదానికొకటి పెనవేసుకున్నట్టు మొత్తం ఆరు కొవ్వొత్తులు పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది ఇది. ఇత్తడితో తయారు చేసిన ఈ అలంకరణ వస్తువు ధర సుమారు రూ.41,000. వివరాలకు svenskttenn.com.

కళ్ల నిండా పగడపు కాంతి…
కుంకుమ రేఖను పోలిన పగడపు అందం కళ్లను కట్టి పడేస్తుంది. అందులోనూ సహజ సిద్ధమైనదైతే ఈ అరుణ రత్నపు సోయగం నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే. అందుకే దానికి దిష్టి తగలకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నయా నగల డిజైనర్లు. ‘నజర్ మినీ అన్నాక్యాప్రి కోరల్ ఇయర్ రింగ్స్’ ఆ ఆలోచనకుచిరునామాలు. ఇందులో పగడపు దిబ్బల నుంచి సేకరించిన ముడి పగడాలకు పాలిష్ చేసి జుంకాలుగా వేలాడదీశారు. దుద్దు భాగంలో నజర్ (దిష్టి) సూచికగా చెప్పే కళ్ల డిజైన్‌ను జోడించారు. దిష్టి తగలకుండా ఉండేందుకు వాడే ఇవిల్ చిహ్నం కళ్లలో తెలుపు, నీలం రాళ్లను పొదిగారు. టర్కీకి చెందిన డిజైనర్ బేగం ఖాన్ ఈ చిత్రమైన చెవిపోగుల సృష్టికర్త. వివరాలకు matchesfashion.com. ధర లక్షా పాతికవేల రూపాయలు!

T Shirt
వారికే ప్రత్యేకం
ట్రాన్స్జెండర్లు, స్వలింగ సంపర్కులను సమాజం ఎంతో భిన్నంగా చూస్తుంది. వాళ్ల ఆలోచనలు కూడా భిన్నంగానే ఉంటాయి. వాటిని చిత్ర రూపంలో ప్రతిబింబిస్తూ ఇటీవల డీజిల్, టామ్ ఆఫ్ ఫిన్‌ల్యాండ్ ఫౌండేషన్ ఒక టీ షర్టును రూపొందించాయి. కాస్త పారదర్శకంగా ఉండే వస్త్రంతో చేసిన వీటి మీద ఎల్జీబీటీ కమ్యూనిటీని ప్రతిబింబించే కళాత్మక చిత్రం ముద్రించి ఉంటుంది. విశాలమైన వస్త్ర ప్రపంచంలో వాళ్లకూ ప్రత్యేకంగా చోటివ్వాలన్నఉద్దేశంతో ఈ టీషర్టుల కలెక్షన్‌ను రూపొందించినట్టు చెబుతున్నాయా సంస్థలు. ధర రూ. 23 వేలు. farfetch.com లో ఆర్డర్ చేయవచ్చు.
Read More :
Naya Mall | ఫెరారీ నుంచి అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

