Twitter | నిలిచిపోయిన ట్విట్టర్ కాపీరైట్ వ్యవస్థ.. నచ్చిన సినిమాలు అప్లోడ్ చేసిన యూజర్లు
అప్రమత్తమైన ట్విట్టర్ ఈ వీడియోలు ప్లే కావు అని డిస్ప్లేలో తెలిపింది
Twitter : సోషల్‌మీడియా సంస్థ ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు, ఉన్నత ఉద్యోగుల రాజీనామాలతో ఈమధ్య తరచూ వార్తల్లో ఉంటోంది. ఉద్యోగులను తొలగిస్తూ ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయం ప్రభావం ట్విట్టర్‌పై పడింది. తాజాగా ట్విట్టర్లో కాపీరైట్ స్ట్రైక్ వ్యవస్థ పనిచేయలేదు. దాంతో, యూజర్లు తమకు నచ్చిన సినిమాలు, కార్టూన్, టీవీ వీడియోలను వరుస ట్వీట్లతో అప్లోడ్ చేశారు.
ఒక యూజర్ నీడ్ ఫర్ ప్పీడ్ సినిమాను 66 ట్వీట్లలో అప్లోడ్ చేశాడు. మరొక యూజర్ ‘స్పాంజ్బాబు స్క్వేర్పంట్స్’ ఎపిసోడ్ పెట్టాడు. ‘ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ : టోక్యో డ్రిఫ్ట్’ సినిమాను రెండు నిమిషాల వీడియోగా 50 ట్వీట్లలో అప్లోడ్ చేశాడు. దాంతో, ఆ సినిమాలు, టీవీ షోల కాపీరైట్ తీసుకున్నవాళ్లు ట్విట్టర్ నుంచి వాటిని తొలగించేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
అయితే, వెంటనే అప్రమత్తమైన ట్విట్టర్ ఈ వీడియోలు ప్లే కావు అని డిస్ప్లేలో తెలిపింది. కాపీరైట్ స్క్రైక్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించకుంటే అమెరికా డిజిటల్ మిల్లీనియమ్ కాపీరైట్ యాక్ట్ (డీఎంసీఏ) కింద ట్విట్టర్‌పై చర్యలు తప్పవు. ట్విట్టర్లో టెక్నికల్ సమస్యల్ని పరిష్కరించడానికి తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారని ట్విట్టర్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ట్విట్టర్ పోయిన వారంలో 3,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

